నిజామాబాద్ రూరల్: ధర్పల్లి సీ.హెచ్.సీ, తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీ.హెచ్.సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసo స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సీ.హెచ్.సీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు.