అన్నమయ్య జిల్లాను మూడు భాగాలుగా పునర్విభజించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. జిల్లా కేంద్రమైన రాయచోటి నుండి ప్రాంతాలు విడిపోయే పరిస్థితి ఏర్పడితే, అభివృద్ధికి అవసరమైన కీలక వనరులు కోల్పోయే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.రాయచోటి ఇప్పటికే రాష్ట్రంలో చిన్న జిల్లాల్లో ఒకటిగా మారిందని, పలు ప్రాంతాలు ‘కార్నర్ జోన్’లుగా మారడంతో అభివృద్ధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాను మరింతగా విభజించడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.