బనగానపల్లె: నంద్యాలలో ఎలినో ఎఫెక్ట్, అవుకు రిజర్వాయర్ లో పడిపోయిన నీటి నిలువలు, ఆందోళనలో రైతులు
ఎల్నినో ప్రభావంతో తగిన మోతాదులో వర్షాలు కురవకపోవడంతో అవుకు రిజర్వాయర్లో పదేళ్ల తర్వాత నీటి నిల్వలు పడిపోయాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 4.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం తక్కువ ఉన్నందున ఖరీఫ్ పంట సాగుకు నీళ్లు వదిలే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. సమయానుకూలంగా పంట సాగుకు నీటిని వదులుతారా, లేదా? అని రైతులు సందిగ్ధంలో పడ్డారు.