బనగానపల్లె: అర్జీలకు త్వరితగతిన పరిష్కారం : బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బనగానపల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.