నంద్యాల అర్బన్: నంద్యాల వైయస్సార్ నగర్ లో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి
Nandyal Urban, Nandyal | Apr 12, 2026
నంద్యాల లోవైఎస్ నగర్ లో నూతనంగా నిర్మించిన హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. కార్య క్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది.