కనిగిరి: పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి తహసిల్దార్ రవిశంకర్, ఎస్సై శ్రీరామ్
కనిగిరి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తహసిల్దార్ రవిశంకర్, ఎస్సై శ్రీరామ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాల్లో ఎరువులు, యూరియా నిల్వలను వారు పరిశీలించారు. అక్రమంగా ఎరువులను నిల్వచేసినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై శ్రీరామ్ మాట్లాడుతూ నిరంతరం ఎరువుల దుకాణాలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలకు పాల్పడవద్దని దుకాణాల నిర్వహకులను హెచ్చరించారు.