యాగంటి సమీపంలో మూగజీవాల కోసం నీటి తొట్టి ఏర్పాటు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి సమీపంలోని మారునీళ్ల చెలిమి దేవస్థానం వద్ద పశువులు, పక్షుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టిని బనగానపల్లి రూరల్ సీఐ మంజునాథరెడ్డి సోమవారం ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మూగజీవాల దాహం తీర్చేందుకు ఈ చర్య చేపట్టారు. దేవస్థానం బోర్డ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సీఐ అభినందించారు. రామ్మోహన్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.