రాప్తాడు: మామిళ్లపల్లిలో వైయస్సార్ యువజన విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకువ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటు కార్నకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాజీ సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ పార్టీ ఆదేశాల మేరకు ప్రజల నుంచి మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యువజన విభాగం రాప్తాడు అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి లింగారెడ్డి పేర్కొన్నారు.