బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్లగడ్డ డిఎస్పి
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆళ్లగడ్డ నూతన డీఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి డీఎస్పీని అభినందిస్తూ, విధుల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు