నెల్లూరును వదలని వాన, రోడ్లన్నీ జలమయం
నెల్లూరు జిల్లాని వరుణుడు ఇప్పుడల్లా వదిలేలా లేడు. గత రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో గురువారం ఉదయం నుంచి వర్షాలు పడుతూ ఉండడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దింతో నెల్లూరు జిల్లా కి వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.