ఒంగోలు అర్బన్: ఒంగోలు హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
Ongole Urban, Prakasam | Jun 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.3.80 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషనను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి 25 సబ్జెస్టేషన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పీఎం సూర్య ఘర్, పథకాల ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నామన్నారు.