సత్తుపల్లి: పట్టణంలో కిరాణా షాప్ రేకులను పగలగొట్టి రూ.50 వేల విలువైన వస్తువులను చోరీ చేసిన దుండగుడు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పాత సెంటర్ లోని కిరాణా షాప్ లో ఓ వ్యక్తి చోరీకు పాల్పడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో షాపు పైన రేకులను కట్ చేసి,సీలింగ్ ను పగలగొట్టి లోపలికి చొరబడి సుమారు 50 వేల రూపాయల విలువ గల వస్తువులను అపహరించాడు.నగదు,సిగరెట్స్ ను చోరీ చేశాడు.ఉదయం షాపు తీసిన యజమాని దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.అయితే షాప్ లోని సీసీ కెమెరాలో చోరీకి పాల్పడిన వ్యక్తి దృశ్యాలు నమోదు అయ్యాయి.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు..