తెలంగాణలో మహిళా సాధికారత కోసం హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా జరిగింది. మహిళా ఉపాధి, భద్రత, ఆరోగ్యం, లింగ సమానత్వంపై నిపుణులతో విస్తృత చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు ఆధారంగా మార్చి 8 నాటికి కొత్త మహిళా విధానం రూపొందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.