పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీలో చీమలకు భయపడి ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య
చీమలకు భయపడి యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్ పూర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా(25) చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. మనీషా 2022లో శ్రీకాంత్‌తో వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వి (03) ఉంది. ఉద్యోగ రీత్యా అమీన్‌పూర్‌లోని నవ్య హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.