మేడిపల్లి: కథలాపూర్ మండలం పోసానిపేట వద్ద బైకుపై గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్,160 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం 1:00 కు బైక్ పై గంజాయి తరలిస్తురన్న సమాచారంతో ఎస్ఐ నవీన్ కుమార్ తండ్రియాల గ్రామానికి చెందిన కాసరపు వర్ధన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. వర్ధన్ సులువుగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో నిషేధిత గంజాయిని కొని ,దానిని తమ గ్రామంలో యువకులకు అమ్ముతున్నారని, విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకొని అతని వద్ద నుండి 160 గ్రాముల గంజాయి, బైకు ,ఫోను ,స్వాధీనం చేసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వర్ తెలిపారు.