చొప్పదండి: శివారు ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని రోడ్డు ప్రమాదం ఇద్దరికీ తీవ్ర గాయాలు
కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండల కేంద్రంలో,గురువారం 8:50 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,కరీంనగర్ కు చెందిన సదానందం, చొప్పదండి నుండి కరీంనగర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా,తీగల గుట్టపల్లి నుండి ద్విచక్ర వాహనంపై శివ అతని స్నేహితుడు చొప్పదండి కి వెళ్తున్న క్రమంలో,గ్రామ శివారు ప్రాంతం వద్దకు రాగానే ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయిన శివ ఎదురుగా వస్తున్న సదానందం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు,దీంతో సదానందం కు శివకు తీవ్ర గాయాలు కాగా సదానందం పరిస్థితి విషమంగా మారింది,శివ ద్విచక్ర వాహనం పైనున్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు,