తాడేపల్లిగూడెం: అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అనడం విచిత్రంగా ఉంది : రాజ్యసభ సభ్యుడు సత్యనారాయణ
అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అనడం విచిత్రంగా ఉందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అమరావతిని విభేదించిన రాజకీయ పార్టీ మీది కాదని, అదనపు భూమి కావాలని సూచించింది మీరేనని, చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు లేదని, తనకు ఉందని, ఇక్కడి నుంచే పాలన చేస్తానని చెప్పింది మీరేనని' గుర్తు చేశారు.