కనిగిరి: నియోజకవర్గానికి ఇచ్చిన 5 హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన ఐదు హామీలను నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే ముక్కు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం పెదచెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు MSME పార్క్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గానికి NIMZE ప్రాజెక్ట్ కేటాయించారని, రైల్వే లైన్ నిర్మాణానికి రూ 24 కోట్లు నిధులు సీఎం మంజూరు చేశారని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సమస్య రూ. 250 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 173 కోట్లు నిధులు కేటాయించారన్నారు. ట్రిపుల్ ఐటీ కాలేజీ కేటాయించారు అన్నారు.