ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వీధులు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించి పెట్రోలింగ్ బలోపేతం చేశారు.ప్రజల్లో భద్రతాభావం పెంచడం, నేరాలను అరికట్టడం ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.ఏదైనా అనుమానాస్పద అంశం గమనిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.