ఒంగోలు అర్బన్: ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సమ్మర్ స్పోర్ట్స్ చిల్డ్రన్ గేమ్స్ క్యాంపును ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమ్మర్ స్పోర్ట్స్ చిల్డ్రన్స్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు. క్రీడలు వ్యక్తిగత నైపుణ్యాన్ని వెలికితీస్తాయని ఇటువంటి స్పోర్ట్స్ క్యాంప్ లను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని అన్నారు. స్పోర్ట్స్ కొట్టాలో ఎంతోమంది పోలీస్ ఇతర ఉద్యోగాలు కూడా పొందారని విద్యార్థులకు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.