బనగానపల్లె: బనగానపల్లెలో త్వరలో అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ :మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె అవుకు మెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం గుర్తించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇల్లులేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భూముల చదును పనులు, జంగిల్ క్లియరెన్స్ తదితర అభివృద్ధి పనులను వారు పరిశీలించారు.