ఒంగోలు అర్బన్: వ్యక్తిగత రక్త పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోవాలి : వైద్యశాఖ అధికారులు
Ongole Urban, Prakasam | Jun 22, 2026
సమాజంలో ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వ్యక్తిగత రక్త పరీక్షలు చేపించుకోవటం చాలా అవసరం అని దీనివల్ల మనిషిలో ఉన్నటువంటి మనకు తెలియకుండా దాగి ఉండే వ్యాధుల నిర్ధారణ మనకు తెలుస్తుందని తద్వారా మనం ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స చేయించుకోవడం చాలా అవసరమని ప్రకాశం జిల్లా లెప్రసీ క్షయ మరి ఎయిడ్స్ కి వెళ్తున్న అధికారి డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు.సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ప్రకాశం జిల్లా వైద్యారోగ్య శాఖ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమగ్రగా కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్( ఐ.సి.టి సి ) నాగులుప్పలపాడు లో ఈ టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభించడం జరిగినది