ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుస చోరీలతో బెండలెత్తిపోతున్న ప్రజలు, అనుమానస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా ఐదు దొంగతనాలు జరిగాయి. కొమరోలు, గిద్దలూరు, దొనకొండ, ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వరుస చోరీలు జరుగుతూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా నగదు బంగారం, వెండి దొంగల పాలయ్యింది. ఎవరైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లను సంప్రదించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.