డోన్: డోన్- నంద్యాల బస్సుల కొరతపై ఆగ్రహం, డిపో మేనేజర్ కు బిజెపి నాయకుల వినతిపత్రం
Dhone, Nandyal | Apr 16, 2026 డోన్ పట్టణం నుంచి జిల్లా కేంద్రం నంద్యాలకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ బీజేపీ నాయకులు డోన్ ఆర్టీసీ డిపో మేనేజర్ చలపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డోన్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నంద్యాలకు వెళ్లేందుకు తగిన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ డోన్ నుంచి నంద్యాలకు కనీసం 2 నుంచి 3 ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్టాండ్‌లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డోన్ డిప