ఉరవకొండ: పట్టణంలోని శ్రీ కరి బసవ గవిమఠ సంస్థానంలో కన్నుల పండువగా కార్తీక లక్ష దీపోత్సవం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ కరిబసవ గవిమఠ సంస్థానంలో బుధవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవాన్ని భక్తజనం నిర్వహించారు. గవి మఠంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గవిమఠ నిర్వాహకులు పోలీసు అధికారులు పాల్గొని దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు.