ఖమ్మం అర్బన్: హైదరాబాద్ బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మందికి గాయాలు
హైదరాబాద్ బాటసింగారం వద్ద ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని ఖమ్మం డీఎం శివప్రసాద్ తెలిపారు.