తాడికొండ: అనంతవరంలోని టిడ్కో గృహాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కి ఫిర్యాదు చేసిన స్థానికులు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలోని టిడ్కో గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆదివారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించి గృహాల వద్దకు వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఎస్సై కలగయ్యను పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.