గుంతకల్లు: జెడ్ వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం ఆధ్వర్యంలో గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జెడ్ వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడారు. జెడ్ వీరారెడ్డి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు లేవన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని కమిషనర్ జబ్బార్ మియా కు అందజేశారు.