పలమనేరు: పెద్దపంజాణి: రాజు పల్లి సమీపంలో 8మంది జూదరులు అరెస్ట్, 16,250 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెద్దపంజాణి: మండలం ఎస్సై ధనుంజయ రెడ్డి ఆదివారం తెలిపిన సమాచారం మేరకు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు, తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 16,250 నగదు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు మీ సమీపంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.