ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించిన ఆమె ముఖ్యంగా గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆస్పత్రి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు, అనంతరం అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేశారు, ప్రజలకు నాణ్యమైన సమయానుకుల వైద్య సేవలు అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.