అవకాశం వస్తే మళ్లీ అనంతపురానికి వస్తా సోములదొడ్డి మారుతి సుజుకి ఆటోమొబైల్ షోరూమ్ వద్ద సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ సోమలదొడ్డి వద్ద ఆదివారం రెండు గంటల సమయంలో మారుతి సుజుకి కార్ల షోరూం ప్రారంభించి అనంతరం సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు రావడం ఇదే మొదటిసారి అని అనంతపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి కార్ల షోరూం ప్రారంభించేందుకు ఇక్కడికి రావడం జరిగిందని భవిష్యత్తులో అవకాశం వస్తే మరొకసారి అనంతపురం జిల్లాకు వస్తానని అదే విధంగా తెలుగు సినిమాలు చేసేందుకు కథలు చర్చల్లో ఉన్నాయని సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాకు వివరాలను వెల్లడించారు.