బీటీపీ ప్రాజెక్ట్ గేట్స్ నుండి నీరు వదులుతుండటం వలన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని హగిరినది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెళుగుప్ప మండల తహసీల్దార్ అనిల్ కుమార్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. నీటి ప్రవాహం ఉన్నటువంటి ఎన్.గుండ్లపల్లి, రమనేపల్లి,శ్రీరంగాపురం, బూదివర్తి గ్రామాల వద్ద హగరినదిలోకి ఎలాంటి వెహికల్స్ వెళ్ళకుండా దారులన్నింటిని విఆర్వోల పర్యవేక్షణలో ముల్లకంచెలు వేయించారు . బీటీపి నుంచి విడుదల చేసిన వందల క్యూసెక్కులనీరు ఉదృతంగా హగరి నది ప్రవహిస్తుందని కావున ప్రజలు అటుగా వెళ్లరాదని తహసీల్దార్ పేర్కొన్నారు.