నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నరసరావుపేట మండలం రావిపాడులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి 9గంటలకు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో తన సిబ్బందితో దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 250 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.