జగనన్న కాలనీ వద్ద పిచ్చికుక్క దాడి – వృద్ధురాలు గాయాలు
జగనన్న కాలనీ వద్ద పిచ్చికుక్క దాడి – వృద్ధురాలు గాయాలు రాయచోటి రూలర్ పరిధిలోని గంగోత్రి ఫ్యాక్టరీ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద పిచ్చికుక్కల ఉన్మాదం తీవ్రంగా పెరిగిపోతోంది. సోమవారం రాత్రి 50 సంవత్సరాల వృద్ధురాలిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.