మంచిర్యాల: మంచిర్యాలలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్: నిందితుల నుంచి స్టాంపులు, కంప్యూటర్ స్వాధీనం
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్విష్ ఫిర్యాదుతో నకిలీ ప్లాంట్ ఏరియా సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను నస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ స్టాంపులు, ప్లాంట్ ఏరియా సర్టిఫికెట్లు, కంప్యూటర్ మరియు ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు.