రాజమండ్రి సిటీ: ఓటర్లు జాబితా అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ కార్యక్రమం
ఓటర్ల జాబితా అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దేశ వ్యాప్త ఉద్యమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో శనివారం సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. రాజమండ్రిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తొలి సంతకాన్ని పార్టీ నాయకుడు టికే విశ్వేశ్వర్ రెడ్డి చేశారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.