హత్నూర: బోర్పట్ల గోవిందరాజు పల్లి గ్రామాల్లో శ్రమదాన కార్యక్రమాలు, పాల్గొన్న మహిళలు గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం బోరుపట్ల గోవిందరాజు పల్లి తదితర గ్రామాల్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని గ్రామంలోని పురవీధుల గుండా ఉన్న రోడ్లను శుభ్రం చేయడంతో పాటు ఇండ్ల మధ్యన పేర్కొన్న చెత్తాచెదారం పొదలను తొలగించారు. ప్రతి ఒక్కరు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.