కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
కోడుమూరు నియోజకవర్గంలో దీపాలు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులు, యువకులు, పెద్దలు సంతోషంగా బాణసంచా కాల్చారు. చిచ్చుబుడ్లు, కాకరవత్తులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఇంటిల్లిపాది పిండివంటలు ఆరగించారు.