డోన్: డోన్ లో జన విజ్ఞాన వేదిక గోడపత్రిక ఆవిష్కరణ
Dhone, Nandyal | Jun 3, 2026 డోన్ కొత్తపేట ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక డివిజన్ అధ్యక్షుడు సర్వజ్ఞమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం శెట్టి, రామమూర్తి ఆధ్వర్యంలో సభ్యత్వ క్యాంపెయిన్ గోడపత్రికను ఆవిష్కరించారు. శాస్త్రీయ ఆలోచనలే సమాజ సమస్యలకు పరిష్కారమని, శాస్త్రీయ దృక్పథంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో శాస్త్రీయ చైతన్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.