గుంతకల్లు: కరువు మండలాలుగా ప్రకటించాలి, వైసీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గుత్తి వ్యవసాయ ఏడీఏ వెంకట్రాముడుకు వినతి పత్రం అందజేత
అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి పంటలు నష్ట పోయిన రైతుకు ఎకరాకు 25వేలు నష్టపరిహారం చెల్లించి, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గుత్తి ఏడీఏ వెంకటరాముడుకి వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం విచారకరమన్నారు.