జహీరాబాద్: జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రావలసిన పెండింగ్ బిల్లులు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు బిల్లులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే బిల్లులు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.లేని ఎడల ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.