కర్నూలు: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం ఉదయం 12 మద్దికెర మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన కుక్కల సీతారామిరెడ్డి కి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్ధిక సహాయాన్ని ఎంపీ తన కార్యాలయంలో అందజేశారు... సీతారామిరెడ్డి క్యాన్సర్ సమస్యతో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందాడు... అనంతరం వైద్య ఖర్చుల కోసం ఎంపీ నాగరాజును సంప్రదించి, ఆయన సిఫార్సు తో సీ.ఎం రీలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా రూ.6 లక్షలు మంజూరు అయ్యాయి...