మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన
మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సీపీఎం నిరసన అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు. మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చారు. లైసెన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో అక్రమ విక్రయాలు పెరిగి, బాటిల్‌కు 40-50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసలవుతున్నారని, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు.