హుస్నాబాద్: హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫామ్ చీరలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డు లో అంగన్వాడీ టీచర్లకు & హెల్పర్లకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పక్షాన అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు యూనిఫాం చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీ టీచర్ల ది కీలక పాత్ర అన్నారు. మీకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత ను విఫలం కాకుండా సరైన విధంగా వ్యవహరిస్తే ఆ తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మను ఇస్తుందన్నారు. గుడ్లు ,పౌష్టిక ఆహారం,మందులు సమయానికి ఇస్తే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని