మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఓకే ఆటోలో 20 నుంచి 30 మంది పిల్లలు ఎక్కించుకొని అతివేగంగా స్కూల్ ప్రాంగణంలోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. స్వల్ప నిర్లక్ష్యంతోనే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికుల ఆవేదన వ్యక్తం. ఇలాంటి ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతే ఎలా అని పలువురు ప్రశ్నించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.