ముమ్మిడివరంలో సూర్య దేవుడు ప్రతిష్టించిన శ్రీ ఉమా సూరేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పుష్పయాగం ఘనంగా జరిగింది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పుష్పయాగం ఘనంగా జరిగింది. నగర పంచాయతీ పరిధిలో సూర్యదేవుడు ప్రతిష్టించిన స్వామివారి దేవాలయంలో ఆలయ అర్చకులు కొత్తలంక సూరిబాబు, రాము శర్మ, ఈవో లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఈనెల 19వ తేదీన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పుష్పయాగం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వచించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించారు.