పెడన: పెడన తులసీ థియేటర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత.. అంబేద్కర్ బొమ్మ దిమ్మ తొలగింపుపై ముస్లిం కుటుంబంతో వాదనకు దిగిన SCలు
Pedana, Krishna | Jul 21, 2024 కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని తులసీ థియేటర్ వద్ద ఆదివారం ఉదయం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన దిమ్మను స్థానికంగా ఉన్న ఓ ముస్లిం కుటుంబం తొలగించడాన్ని ఎస్సీలు తీవ్రంగా వ్యతిరేకించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఉందని ఆ ముస్లిం కుటుంబం పోలీసులతో సైతం వాదనకు దిగడం విశేషం.