మైదుకూరు: మైదుకూరు:రైతు సేవ కేంద్రాల్లో పంట నమోదు చేయించుకోవాలి
రైతు సేవ కేంద్రాలలో ప్రతి రైతు తాము సాగు చేసి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏవో బాలగంగాధర్ రెడ్డి అన్నారు. మంగళవారం మైదుకూరు మండలం విశ్వనాథపురం, అక్కులయపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్త ఫిరోజ్ హుస్సేన్ రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతులకు వివరించారు.