సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు మరో 20 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు అవసరం ఉంటాయని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాట్లాడుతూ.. మరో 20 ఏళ్ల పాటు తెలంగాణకి రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లను పేద ప్రజలకు అందించి తోడుగా ఉన్నారన్నారు.