ఆళ్లగడ్డ: W కొత్తపల్లి గ్రామంలో విషాదం వడదెబ్బతో ఉపాధి కూలీ బాలయ్య మృతి
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం w కొత్తపల్లికి చెందిన ఉపాధి కూలీ బాలయ్య వడదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన w కొత్తపల్లిలో చోటుచేసుకుంది, బాలయ్య కాలువ తీత పనులకు వెళ్లాడు అక్కడ ఎండ తీవ్రతకు సృహ తప్పి పడిపోవడంతో తోటి కూలీలు వెంటనే ఆస్పత్రికి తరలించారు, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు, ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బరాయుడు ఎంపీడీవో సావిత్రి కి సమాచారం అందించారు, వడదెబ్బతో మృతి చెందిన ఉపాధి కూలీ బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉపాధి కూలీలు కోరారు